Praja Vijayotsavalu | ప్రజా విజయోత్సవాలకు ప్రభుత్వం రెడీ.. ప్రకటించిన డిప్యూటీ సీఎం

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుంది. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని కాంగ్రెస్ నిశ్చయించుకుంది. ఇందులో భాగంగానే నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు(Praja Vijayotsavalu) నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ ప్రజా విజయోత్సవాలను ఎలా నిర్వహించాలి, ఏయే అంశాలపై ప్రచారం చేయాలని వంటి అంశాలపై చర్చించడం కోసం క్యాబినెట్ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ సబ్ కమిటీతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. భట్టి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఈ ప్రజా విజయోత్సవాలకు సంబంధించి రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రజా ఉత్సవాలను భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు 14 నవంబర్‌న ప్రారంభించి కాంగ్రెస్ ప్రస్తుత అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు 9 డిసెంబర్‌ న ముగించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. 25 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఏ రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలని అన్నది ఇంకా పైనల్ కావాల్సి ఉంది.

ఆ అంశాలపై ప్రజలకు అవగాహన

- Advertisement -

ఈ ఉత్సవాల్లో భాగంగా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్ట్ లకు కూడా ప్రభుత్వ శ్రీకారం చుట్టనుంది. వాటితో పాటు రానున్న నాలుగన్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఈ సంబరాలను రాజధాని హైదరాబాద్‌లో మొదలు పెట్టి రాష్ట్ర నలుమూలల్లో కూడా నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్నో కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుడతామని, అన్నీ కూడా ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసమేనని భట్టి విక్రమార్క తెలిపారు.

విజయోత్సవాల్లో చేసేదిదే: భట్టి

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని, ఏ ప్రభుత్వం చేపట్టిని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టిందని అన్నారు భట్టి. వాటన్నింటినీ కూడా ఈ విజయోత్సవాల్లో(Praja Vijayotsavalu) ప్రదర్శిస్తామని, వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విజన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేస్తామని వివరించారు.

ఈ 26 రోజుల కార్యక్రమాల్లో ప్రభుత్వ గ్యారెంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విధ్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు, ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక అధివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చైతన్య పరుస్తామని తెలిపారు.

‘‘ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తాం. అదే విధంగా పారామెడికల్, 16 నర్సింగ్ కళాశాలలను నవంబర్ 28న ప్రారంభిస్తాం. వీటితో పాటుగా ఈ ఉత్సవాల్లో భాగంగా పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నాం. గ్రూప్-4కు ఎంపికయిన వారికి నియామక పత్రాలు అందిస్తాం. డిసెంబర్ 9న హైదరాబాద్ వేదికగా భారీ ఎత్తున ప్రజా వియోత్సవాల ముగింపు వేడుకలు చేస్తాం’’ అని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) వెల్లడించారు.

అంబరాన్నంటేలా ఉత్సవాలు

‘‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు రూ.18వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ చేశాం. దాంతో పాటు మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాం. నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. చివరి రోజు డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం’’ అని ప్రకటించారు.

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం ఉంటుందని అన్నారు భట్టి. అదేవిధంగా, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఈ విజయోత్సవాల ఏర్పాట్ల విషయంలో అలసత్వం పనికిరాదని చెప్పారు.

Read Also: కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్, హరీష్

Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...