Champions Trophy | పాకిస్థాన్‌కా ససేమిరా వెళ్లమంటున్న టీమిండియా..

-

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025కు పాకిస్థాన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఈ విషయంలో ఐసీసీ(ICC)కి బీసీసీఐ ఒక స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్‌కు టీమిండియా జట్టును పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది బీసీసీఐ. పాకిస్థాన్‌కు జట్టును పంపడానికి ప్రభుత్వ అనుమతి లేదని, ఆ దేశంలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేమని బీసీసీఐ(BCCI) కరాఖండిగా తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. టీమిండియా రానని చెప్పేయడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇదేమీ కొత్తకాపోయినా గతేడాది పాకిస్థాన్‌కు రామని భారత్ చెప్పడం కాస్తంత సంచలనంగా మారింది. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి.

- Advertisement -

అయితే 2008 ముంబై దాడుల తర్వాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టు.. పాకిస్థాన్(Pakistan) గడ్డపై అడుగుపెట్టలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు, బహుళ దేశ టోర్నీల కోసం రావాలని పీసీబీ ఎన్నిసార్లు కోరినా బీసీసీఐ మాత్రం ఆ దేశానికి జట్టును పంపలేదు. కానీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి మాత్రం ఎలాగైనా టీమిండియాను రప్పించాలని పీసీబీ ప్రయత్నిస్తోంది. పాక్, భారత్ మధ్య అన్ని మ్యాచ్‌లకు ఒకే వేదికలో నిర్వహించి.. భారీ భద్రత కల్పిస్తామని కూడా పీసీబీ చెప్తోంది. ఎలాగైనా పాక్‌కు జట్టును పంపేలా బీసీసీఐను ఒప్పించేలా ఐసీసీపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా పీసీబీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ కుదరదని బీసీసీఐ చెప్పేయడంతో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌లంత వరకు యూఏఈ(UAE) లేదా మరేదైనా వేరే వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకోవడం తప్ప పీసీబీ ముందు మరో మార్గం ఉన్నట్లు కనిపించడం లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Read Also: టీమిండియాలో రింకూ సింగ్‌కు అన్యాయం జరుగుతుందా..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...