వేరే దేశం వెళితే కచ్చితంగా వీసా పాస్ పోర్టు కావాల్సిందే, మరి మన దాయాదీ దేశం వెళితే అవి లేకపోతే వెంటనే జైల్లో వేస్తారు, అంతేకాదు 5
సంవత్సరాల కఠినఖారాగార శిక్ష వేస్తారు, ఇలాంటి వారు వందల మంది అక్కడ జైల్లో మగ్గుతున్నారు. తాజాగా పాస్ పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ను, మధ్యప్రదేశ్ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.పాకిస్తాన్ లో అరెస్టయిన ఇద్దరు భారతీయుల్లో ఒకరు ప్రశాంత్ అనే తెలుగు యువకుడు అని గుర్తించారు. అతను అసలు అక్కడ ఎందుకు పట్టుబట్టాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు పాక్ అధికారులతో మాట్లడుతున్నారు తల్లిదండ్రులు కేంద్రాన్ని అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి తన కుమారుడ్ని విడిపించాలి అని అన్నారు.
వీరు అదునాతనంగా ఉగ్రవాద దాడి చేయడానికి పాక్ వచ్చారా అని అక్కడ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి . ఇదే సమయంలో రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రచండ గాలులు వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరోచోటకు వెళుతుంటాయి. దీంతో భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని భారత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో వారు పాక్ భూబాగంలో చేరి ఉంటారు అని చెబుతున్నారు.అయితే అతను ప్రియురాలి కోసం వెళ్లాడు అని వార్తలు వస్తున్నాయి కాని ఇది వాస్తవం కాదు అంటున్నారు అధికారులు.