సాధారణంగా మనం బళ్లు వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి…అయితే కొందరు తమకు ఇష్టం వచ్చిన రీతిన వాహనాలు నడుపుతారు ఈ సమయంలో వారికి ప్రమాదం జరగడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటను జరిగాయి, ఇటీవల సోషల్ మీడియా ప్రభావం మనపై చాలా ఉంటుందో. ఏ చిన్న పనిచేసినా దానిని ఫేస్ బుక్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటున్నాం. కొందరు సోషల్ మీడియాలో తమ అభినయాలతో యాక్టింగ్ తో, టిక్ టాక్ వీడియోలు కూడా చేస్తున్నారు.
తాజాగా కేరళకు చెందిన ఓ బస్సు డ్రైవర్ చేసిన పని అందరిని షాక్ కు గురి చేసింది.. అమ్మాయిలతో గేర్లు వేయిస్తూ బస్సు నడిపాడు. ఈ టిక్టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు, అతని లైసెన్స్ ఆరునెలలు క్యాన్సిల్ చేశారు. ఈ డ్రైవర్ను వయనాడ్కు చెందిన ఎం.షాజీగా గుర్తించారు.
మొత్తానికి ఇలాంటి అతి సాహసాల వల్లే ప్రమాదాలు జరుగుతాయి.. అతనికి ఆరు నెలలు కాదు మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి
అని అంటున్నారు నెటిజన్లు… ఆ అమ్మాయిలు మాత్రం మేము ఏదో సరదాకి చేశాం అంటున్నారు. అయితే వీరి సరదా మరొకరి జీవితాలని
నాశనం చేస్తుంది అని తెలియదు పాపం.