ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్(Kailash Gahlot) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. కైలాష్ ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయంతో ఆప్‌లో తీవ్ర అలజడి మొదలైంది. మంత్రి కైలాష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీ సభ్యత్వానికి, మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని కైలాష్ గెహ్లాట్ ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్(Kejriwal)కు పంపారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆప్ పార్టీనే ప్రధాన కారణమని కూడా ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాపై కైలాష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆప్‌లో తీవ్ర చర్చలకు తెర లేపాయి.
‘‘ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు అన్నీ కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. దీని వల్ల పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలన్న నిబద్దతతో ఏర్పడిన ఆప్ ఆశయాలను.. పార్టీ నేతల రాజకీయ ఆశయాలు అధిగమించాయి. దానిని తట్టుకోలేకున్నాను. మార్చే సామర్థ్యం నాకు లేదు. అందుకే నేను చేయగలిగిన పని రాజీనామా చేస్తున్నాను’’ అని కైలాష్ తన లేఖలో వివరించారు. ఆయన మాటలు ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర రాజకీయ చర్యలకు దారితీస్తున్నాయి. ఎన్నికలకు ముందు మంత్రి కైలాష్(Kailash Gahlot) తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఆయన వ్యాఖ్యలు.. రానున్న ఎన్నికల్లో ఆప్(AAP) విజయంపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్న టాక్ కూడా బలంగానే సాగుతోంది. మరి చూడాలి.. వచ్చే ఎన్నికలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో.