హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు(IT Raids) కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం ప్రారంభించారు. ప్రముఖ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీ(Swastik Realtor Company)లో కూడా సోదాలు చేశారు అధికారులు. కంపెనీ మేనేజర్లు లక్ష్మణ్, కల్పనా రాజేంద్రల ఇళ్లు సహా షాద్‌నగర్, బంజారాహిల్స్, చేవెళ్లలోని కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగించారు అధికారులు. ఏకకాలంలో జరిగిన ఈ సోదాల్లో సదరు సంస్థ చేసిన క్రయవిక్రయాలకు సంబంధించి ఫైల్స్‌ను అధికారులు పరిశీలించారు.
ఇటీవల కాలంలో ఓ ఎంఎన్‌సీ సంస్థకు స్వస్తిక్ సంస్థ(Swastik Realtor Company) రూ.300 కోట్ల విలువైన భూమిని విక్రయించింది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లెక్కలన్నింటికీ బ్యాలెన్స్ షీట్‌లో చూపలేదన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.