Meta కు రూ.213 కోట్ల జరిమానా.. ఎందుకంటే..

-

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు(Meta) భారీ జరిమానా విధించింది భారత్. వాట్సప్ ప్రైవసీ విధానానికి సంబంధించి 8 ఫిబ్రవరి 2021న తీసుకొచ్చిన అప్‌డేట్‌లో అనౌతిక వ్యాపార విధానాలు అవలంభించినట్లు తేలింది. దీంతో మెటాకు ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) రూ.213 కోట్ల జరిమానాను విధించింది. ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం.. తమ డేటాను ఇతర సంస్థలతో పంచుకోవడానికి వినియోగదారులు తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది. 25 ఆగస్టు 2016 నాటి విధానం ప్రకారం ఈ విషయంలో వినియోగదారులదే తుది నిర్ణయంగా ఉండేది. అందుకు భిన్నంగా, వినియోగదారుడి భావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా 2021లో కొత్త విధానాన్ని అమలు చేసింది సంస్థ.

- Advertisement -

ఇలా చేస్తే ఆన్‌లైన్ ప్రకటనల్లో మెటా గుత్తాధిపత్యం వహిస్తోందని సీసీఐ పేర్కొంది. ఇటువంటి పద్ధతులు సరికాదని, తమ వివరాలను మెటా సహా ఇతర సంస్థలతో పంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టమని సీసీఐ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ సీపీఐ ఓ ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వాట్సప్ ద్వారా సేకరించిన డాటాను మెటా(Meta) అనుబంధ సంస్థలతో, మెటా కంపెనీ ఉత్పత్తులతో ప్రకటనల నిమిత్తం అయిదేళ్ల పాటు పంచుకోకుండా చూడాలని ఆదేశించింది సీసీఐ.

Read Also: రాజధానిగా ఢిల్లీ కొనసాగాలా.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Patnam Narender Reddy కి హైకోర్టులో ఊరట.. వాటికి అనుమతి..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)కి తెలంగాణ...

Sanjay Murthy | కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. ఎవరంటే..

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా తొలిసారి ఓ తెలుగు అధికారి...