భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా తొలిసారి ఓ తెలుగు అధికారి బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి(Sanjay Murthy) తాజాగా కాగ్ అధిపతిగా నియమితులయ్యారు. కాగ్ 15వ అధిపతిగా సంజయ్‌ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) నియమించారని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కాగ్ అధిపతి గిరీశ్ చంద్ర ముర్ము(Girish Chandra Murmu) పదవీకాలం ముగియడంతో సంజయ్‌కి అవకాశం కల్పించారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికై, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు సంజయ్. 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్య కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్య విధానం అమలులో క్రియాశీల పాత్ర పోషించారు.
డిసెంబర్ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న క్రమంలో సంజయ్ సేవలను కేంద్రం గుర్తించింది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. కాగా కాగ్ అధిపతి బాధ్యతలు చేపట్టనున్న తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి(Sanjay Murthy) రికార్డులకెక్కారు. ఈ స్థానంలో నియమితులైన వారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది.