లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ ప్రతీక్ జైన్(Prateek Jain)పై దాడి ఘటన సూత్రధారిగా పోలీసులు చెప్తున్న లగచర్ల సురేశ్ అలియాస్ బోగమేని సురేష్ ఈరోజు కోర్టు ముందు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి సురేష్ కోసం పోలీసు బృందాలు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈరోజు హటాత్తుగా అతడే వచ్చి కోర్టు ముందు లొంగిపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తుం సురేష్‌ను పోలీసు కస్టడికీ అందించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ అందుకు న్యాయస్థానం నిరాకరించింది. లగచర్ల కేసులో ఏ2గా ఉన్న సురేష్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధిస్తున్నట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులకు ఒంకింత నిరాశే ఎదురైంది.
ఇదిలా ఉంటే లగచర్ల(Lagacharla)లో కలెక్టర్‌పై దాడికి ముందు సురేష్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్లో పలు సార్లు మాట్లాడుకున్నారని గుర్తించిన పోలీసులు కొన్ని రోజుల కిందటే పట్నం నరేందర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజే ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటుగా పట్నంకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కూడా చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. దీంతో లగచర్ల కేసులో పట్నంకు కాస్తంత ఊరట లభించినట్లయింది.