AR Rahman | విడాకులు తీసుకున్న ఏఆర్ రెహ్మాన్‌ దంపతులు..

-

ఏఆర్ రెహ్మాన్(AR Rahman) పేరు తెలియని వారుండరు. సంగీత పరిశ్రమలో సంగీత సామ్రాట్‌గా పేరొందాడు. అతని మ్యూజిక్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అతని పేరే ఒక బ్రాండ్. ప్రస్తుతం రెహ్మాన్ దంపతులు తమ వైవాహిక జీవితం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ విడాకుల లాయర్ వందనా షా ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. కొరవడిన భావోద్వేగాలు, అనూహ్య పరిస్థితుల వల్లే వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా న్యాయవాది వందన వివరించారు. ఈ విషయంపై స్పందించిన రెహ్మాన్ కుమారుడు అమీన్.. ‘మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి’ అని రాసుకొచ్చాడు.

- Advertisement -

1995లో రెహమాన్(AR Rahman), సైరా బానూ(Saira Bhanu) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. ‘‘పెళ్ళయిన ఏళ్ల తర్వాత విడిపోవాలన్న కఠిన నిర్ణయానికి వీరొచ్చారు. ఒకరిపై మరొకరికి అమితమైన ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కొన్ని అనూహ్య పరిస్థితులు వీళ్లిద్దరి మధ్య తీవ్ర అగాథాన్ని సృష్టించాయి. బాధను దిగమింగుకుని వారిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కష్టకాలంలో వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ప్రజలు కూడా వారి స్థితిని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా. ఈ కష్టమైన దశను వారిద్దరూ దాటగలరని భావిస్తున్నా’’ అని లాయర్ వందన తన ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: నాలుక తేడాగా ఉంటే పెద్ద ప్రమాదమే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | రాజన్న సిరిసిల్లపై ముఖ్యమంత్రి వరాల జల్లు

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం...

Ponnam Prabhakar | వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్.. భారీ నిధులు ప్రకటించిన మంత్రి

వేములవాడ స్వామి వారి సమక్షంలో ఇచ్చిన హామీని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam...