సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాకతో వేములవాడ పట్టణాభివృద్ధి పరుగులు పెట్టడం ప్రారంభించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. శ్రీరాజరాజేశ్వరి స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.76 కోట్ల వ్యవయంతో పనులు చేపడుతున్నారు. ఈ పనులను ధర్మగుండం దగ్గర శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా వేములవాడ టౌన్ డెవలప్ మెంట్ అథారిటీకి అన్నదాన సత్రం నిర్మించేందుకు నిధులు కేటాయిస్తూ సీఎం వేములవాడకు వచ్చిన రోజే ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైన తొలి ఏడాదిలోనే రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు.
రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులను ప్రారంభించారు. రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి(Mulavagu Bridge) నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. రూ.166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై-లెవెల్ బ్రిడ్జి పనులు , రూ.3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం Revanth Reddy. రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్(Mid Manair Reservoir) నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేయనున్నారు.