సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న అంశంపై ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. తాను, అమ్మ విజయమ్మ, వివేకా కుమార్తె సునీతను ఉద్దేశించి అసభ్యకరంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడ్డటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పోస్టులు పెట్టిన వారితో పాటు పెట్టించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తనతో పాటు విజయమ్మ(Vijayamma), సునీత(Sunitha)పై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డేనని పోలీసులు నిర్ధారించారని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా వైసీపీ సోషల్ సైకో వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అవినాష్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా ఇంతకాలం అసలు అవినాష్‌ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని, ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.
‘‘సోషల్ మీడియా పోస్టుల అవినాష్(Avinash Reddy) ఆదేశాల మేరకు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు పోలీసులు అవినాష్ రెడ్డిని విచారించలేదు. నన్ను, అమ్మను, సునీతను కించపరిచేలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపైనే కాదు పెట్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. సజ్జల భార్గవ్ రెడ్డి(Sajjala Bhargav Reddy) సోషల్ హెడ్ అని తెలుసు. ఎందుకు సజ్జల భార్గవ్ రెడ్డి ని అరెస్టు చేయలేదు. ఎందుకు అరెస్టు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. చేసేవాళ్ళ ను కాదు చేయించే వాళ్ళను అరెస్టు చేయాలి. ఏ ప్యాలెస్‌లో ఉన్నా సరే అరెస్టు చేయాలి. అప్పుడే ఆడవాళ్ళకు భద్రత కలుగుతుంది.
సంఘంలో మహిళలపై చేస్తున్న దాడి ఇది. పెద్ద తలలను పట్టుకోవాలి. నేను కేసు పెట్టాలి అంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా కొంత రాజకీయ ఆరోపణలు ఉంటాయి. రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇప్పటికైనా వివేకా హత్య కేసులో ప్రొగ్రెస్ ఉందని బావిస్తున్నా. ముందు నుంచి నేను సునీత వెంట ఉన్నా. ఇప్పటికైనా బాధితులు సునీత, సౌభాగ్యమ్మ కు న్యాయం జరుగుతుందని బావిస్తున్నా’’ అని ఆమె(YS Sharmila) అన్నారు.