ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. సింగ్ బెంచ్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం కోసం స్పీకర్‌కు తాము కాల పరిమితి విధించలేమని న్యాయస్థానం వెల్లడించింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ కాలయాపన చేస్తానంటే కుదరదని కోర్టు చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు.
‘‘అనర్హత పిటిషన్(MLAs Disqualification Case) విషయంలో రీజనబుల్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పటాన్ని స్వాగతిస్తున్నాం. స్పీకర్ కాలయాపన చేస్తే.. మళ్ళీ కచ్ఛితంగా కోర్టుకు పోతాం. స్పీకర్ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిచ్చి వాగుడుకు మేం సమాధానం చెప్పం. ఎక్కడకు పోయినా.. రేవంత్ రెడ్డిది అదే మెరుగుడు. ఫార్మాకు భూసేకరణపై రేవంత్ కు దమ్ముంటే లగచర్లకు వచ్చి చెప్పాలి’’ అని కేటీఆర్(KTR) ఘాటుగా వ్యాఖ్యానించారు.