మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి(BJP Alliance) రికార్డ్ స్థాయి విజయం నమోదు చేసే దిశగా పయనిస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వాటిలో బీజేపీ, షిండే(Eknath Shinde), అజిత్ పవార్(Ajit Pawar)ల కూటమి 2020కిపైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. శరద్ పవార్, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే కూటమి 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైపోయింది. లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది అంతే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) స్పందించారు.
‘ఏక్ హే తో సేఫ్ హై, మోదీ హేతో ముమ్‌కిన్ హే’’ అని ఆయన తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీ హేతో మేమ్‌కిన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ ఎన్నికల్లో కుల గణన, హిందువుల్లో విభజన భావాలను నాటాలని కాంగ్రెస్, మహావికాస్ అఘాడీ కూటమి ప్రయత్నిస్తోందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ సందర్భంగానే ‘ఏక్ హేతో సేఫ్ హే’ అని నినాదించారు. ఆ నినాదాన్నే ఇప్పుడు ఫడ్నవీస్(Devendra Fadnavis) పోస్ట్‌లో పెట్టారు.