Dhanush | విడాకులు తీసుకున్న ధనుష్-ఐశ్వర్య

-

తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush), అతని భార్య ఐశ్వర్య(Aishwarya) రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత వీరి విడాకుల గురించి పెద్దగా సమాచారం ఏమీ రాలేదు. దీంతో వీళ్లిద్దరూ మళ్ళీ కలిసిపోతారా? కలిసిపోతే బాగుండు.. అని అభిమానుల్లో చర్చ, ఆశ మొదలయ్యాయి. కానీ ధనుష్ దంపతులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఇద్దరూ కూడా విడిపోవాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాము కలిసి ఉండాలని అనుకోవడం లేదని, విడిపోవాలన్న నిర్ణయానికి ఇద్దరిమీ పరస్పర అంగీకారంతోనే వచ్చామని వారు స్పష్టం చేశారు.

- Advertisement -

ఈ క్రమంలో ధనుష్(Dhanush), ఐశ్వర్యకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు 27 నవంబర్ 2024న తీర్పును వెలువరించింది. ఇదిలా ఉంటే ధనుష్, ఐశ్వర్య 2004లో దాంపత్య బంధంలోకి అడుగు పెట్టారు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు ఉన్నారు. 2022లో పలు కారణాల వల్ల విడిపోతున్నామని వీరు ప్రకటించారు. ఇప్పుడు అధికారికంగా విడిపోయారు.

Read Also: సినిమాలకు ఇక గ్యాప్ ఇవ్వను: బన్నీ
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR పై ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR)పై ఐపీఎస్ అధికారుల సంఘం...

Parliament | అదానీ ఎఫెక్ట్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా..

అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament)...