Sambhal Masjid Case | సంభల్ మసీదుపై చర్యలొద్దు.. సుప్రీంకోర్టు ఆదేశాలు

-

Sambhal Masjid Case | ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్లో ఉన్న షాహీ జామా మసీదు వివాదం విషయంలో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తదుపరి విచారణను తాత్కాలికంగా నిలపివేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. 1526లో అక్కడ హిందూ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ ధ్వంసం చేసి అక్కడ మసీదును నిర్మించారని హిందూ పక్షం వాదనలు వినిపించింది.

- Advertisement -

ఈ కేసు(Sambhal Masjid Case) విచారణలో బాగంగా అడ్వకేట్ కమిషనర్‌తో మసీదులో సర్వే నిర్వహించాలంటూ ఈ నెల 19న జిల్లా సివిల్ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ప్రకారం సర్వే నిర్వహించడం కోసం అధికారులు సంభల్ వెళ్లగా ఈ నెల 24న ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై మసీదు కమిటీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna), జస్టిస్ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం.. సంభల్ ప్రాంతంలో శాంతి, సామరస్యాలు నెలకొనడం ప్రస్తుతం చాలా ముఖ్యమని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ వివాదం విషయంలో తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని, సర్వే నివేదికను తెరవను కూడా తెరవొద్దని స్పష్టం చేసింది. ఆర్టికల్ 227 ప్రకారం జిల్లా కోర్టు సర్వే ఉత్తరవులను హైకోర్టులో ఛాలెంజ్ చేయాలని మసీదు కమిటీకి న్యాయస్థానం సూచించింది.

Read Also: మళ్ళీ కలిసిపోనున్న రెహ్మాన్, సైరా..?
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | రైతులను మోసం చేసినందుకా పండగ.. రేవంత్‌కు హరీష్ రావు ప్రశ్న

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమాన్ని ఉద్దేశించి...

Revanth Reddy | వేసిన ఓటే రైతుకు అభయహస్తమైంది: రేవంత్

తెలంగాణ రైతులు జీవితాల్లో గతేడాది డిసెంబర్‌లో కొత్త వెలుగు విరసిల్లాయని సీఎం...