Amaran OTT | ఓటీటీలోకి ‘అమరన్’ అరంగేట్రం అప్పుడే..!

-

Amaran OTT | దీపావళి కానుకగా విడుదలపై లక్ష్మీబాంబులే మేలిన సినిమా ‘అమరన్’. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఇందులో కార్తికేషన్(Sivakarthikeyan), సాయి పల్లవి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు వేచి చూడటం ప్రారంభించారు. దాని తగ్గట్టుగానే అదిగో.. ఇదిగో అంటూ అనేక రూమర్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో తాజాగా ‘అమరన్’ ఓటీటీ(Amaran OTT) రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రేక్షకుల ఎదురుచూపులకు నెట్‌ఫ్లిక్స్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో కూడా ఒకేరోజు ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమాను అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా వీక్షించొచ్చంటూ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ సినిమాను 2014లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌(Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చూసిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక.. సాయిపల్లవి(Sai Pallavi)పై ప్రశంసల వర్షం కూడా కురిపించింది. ఇందులో నటులందరూ కూడా అద్భుతంగా నటించారని, పాత్రలకు ప్రాణం పోశారంటూ జ్యోతిక కితాబిచ్చింది.

Read Also: ఉల్లిపాయలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...