భారతదేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప-2(Pushpa 2)’ ఒకటి. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి భాష ప్రేక్షకులు కూడా ‘పుష్ప-2’ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా రిజల్ట్స్ కూడా డిసైడ్ అయిపోయాయి.
బాలీవుడ్ ప్రముఖులు కూడా పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదని పుష్ప-2 గ్రాండ్ సక్సెస్ పక్కా అని చెప్తున్నారు. దీంతో ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ కాగా రేట్లు పెరుగుతున్నాయి. రిలీజ్‌కు ముందే ‘పుష్ప-2’ తన టికెట్ ధరలతో మంట పుట్టిస్తోంది. ఢిల్లీ, ముంబైలోని కొన్ని థియేటర్లలో పుష్ప-2 మూవీ హిందీ వెర్షన్ టికెట్లను రూ.3000కు అమ్ముతున్నారు. ఈ ధర బ్లాక్‌లో కాదు.. డైరెక్ట్ బుక్‌మై షో వంటి ఫ్లాట్‌ఫార్మ్‌లలో పలుకుతోంది.
టాలీవుడ్ సహా బాలీవుడ్‌లో కూడా ‘పుష్ప-2’ మూవీ టికెట్లు భారీ ధరలు పలుకుతున్నాయి. ముంబైలోని మైసన్ పీవీఆర్:జియో వరల్డ్ డ్రైవ్ థియేటర్‌లో ఒక టికెట్ ధర రూ.3వేలు ఉంది. ముంబై(Mumbai)లోని పీవీఆర్, ఐనాక్స్ చైన్ లింక్‌లో ఉన్న కొన్ని స్కీన్స్‌లో కూడా ఒక్కో టికెట్ రూ.1500 నుంచి రూ.2400 వరకు ఉంది.
ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ స్క్రీన్స్‌లో హిందీ 2డీ వెర్షన్ టికెట్ రూ.2400 ఉంది. ఢిల్లీ(Delhi)లో కూడా పీవీఆర్, ఐనాక్స్‌కు సంబంధించిన కొన్ని థియేటర్లలో రూ.1500పైమాటే. ఒక తెలుగు సినిమా టికెట్‌కు ముంబై, ఢిల్లీలో ఈ స్థాయి ధరలు పలకడం ఒంకింత ఆశ్చర్యకరంగానే ఉంది. నిజం చెప్తూ ‘పుష్ప-2(Pushpa 2)’ టికెట్ల ధరలు తెలుగు స్టేట్స్‌లోనే పర్లేదన్నట్లు ఉంది.