Joe Root | సచిన్ రికార్డ్‌ బద్దలు కొట్టిన జో రూట్..

-

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రికెట్‌లో అనేక రికార్డ్‌లను తన సొంతం చేసుకున్న ఆటగాళ్లలో సచిన్ ఒకరు. కాగా తాజాగా సచిన్ పేరిట ఉన్న ఒక రికార్డ్‌ను ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్(Joe Root) బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ను వెనక్కు నెట్టాడు రూట్. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌తో జో రూట్ ఈ ఘటన సాధించాడు.

- Advertisement -

ఈ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి రూట్ ఈ రికార్డ్ సృష్టించాడు. 60 ఇన్నింగ్స్‌లో 1625 పరుగులు చేసి సచిన్ ఈ రికార్డ్‌ను నెలకొల్పాడు. కాగా జో రూట్.. 49 ఇన్నింగ్స్‌లో 1630 పరుగులు చేసి ఈ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు జో రూట్ 150 టెస్ట్‌లు ఆడగా.. వాటిలో మొత్తం 12,777 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్(Joe Root) ఐదో స్థానంలో ఉన్నాడు.

టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..

జో రూట్ – 1630 (49 ఇన్నింగ్స్)

సచిన్ – 1625 (60 ఇన్నింగ్స్)

అలిస్టర్ కుక్ – 1611 (53 ఇన్నింగ్స్)

గ్రేమ్ స్మిత్ – 1611 (41 ఇన్నింగ్స్)

శివనారాయణ్ చందర్‌పాల్ – 1580 (49 ఇన్నింగ్స్)

Read Also: ‘పుష్ప-2’పై టీడీపీ ఎంపీ సంచలన ట్వీట్.. ఏమనంటే..!
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...