ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అప్‌కమింగ్ సినిమా ‘పుష్ప-2(Pushpa 2)’. ఈ సినిమా కోసం ఎంతో కాలంగా అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న వారి ఎదురుచూపులకు తెరపడనుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
‘పుష్ప-2(Pushpa 2)’తో సినిమా పూర్తి కాదట. ‘పుష్ప-3’ కూడా ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో ఈ సినిమాకు పనిచేసిన సౌండ్ ఇంజినీర్ తన టీమ్ వెనక ‘పుష్ప-3’ అని రాసుంది. దీంతో ‘పుష్ప-3’ కూడా ఉందన్న చర్చ మరింత బలోపేతమైంది.
కొన్ని రోజుల క్రితం ‘పుష్ప-3’కి సంబంధించిన కొన్ని వార్తలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇటీవల ‘పుష్ప-3’ వార్తలు ఫేక్ కాదని, ఆ ఆలోచన తమకూ ఉందని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా అల్లు అర్జున్ ఈ ప్రకటన చేశారు. ‘పుష్ప-2’ క్లైమాక్స్ తదుపరి పార్ట్‌కు సంబంధించి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలు ఉండనున్నాయట. కాగా ‘పుష్ప-3’ కచ్ఛితంగా ఉందని సినిమా వర్గాలు చెప్తున్నాయి.
కానీ ఈ సినిమా వెంటనే పట్టాలెక్కదని, రెండు, మూడు సంవత్సరాల తర్వాతే ‘పుష్ప-3’ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యలో అల్లు అర్జున్‌కు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయని, అందుకే ‘పుష్ప-3(Pushpa 3)’కి కాస్త గ్యాప్ ఇచ్చామని మూవీ టీమ్ నుంచి అందుతున్న సమాచారం. బన్నీ ఒప్పుకున్న ఇతర ప్రాజెక్ట్‌లు పూర్తయిన తర్వాతే ‘పుష్ప-3’ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.