Rishab Shetty | మరో చారిత్రాత్మక పాత్రలో రిషబ్ శెట్టి..

-

‘కాంతార(Kantara)’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ చూపించుకున్నాడు కన్నడ స్టార్ ‘రిషబ్ శెట్టి(Rishab Shetty)’. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎన్నుకోవడంలో కూడా రిషబ్ ముందుంటారు. తానే డైరెక్ట్ చేసేవి, నటించేవి.. ఇలా సినిమా ఏదైనా మూవీ వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుంటాడు రిషబ్ శెట్టి. తాజాగా రిషబ్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో కూడా రిషబ్.. ఓ చారిత్రాత్మక పాత్ర పోషించనున్నాడు.

- Advertisement -

ఇటువంటి పాత్రను పోషించే అవకాశం దొరకడం చాలా సంతోషంగా ఉందని రిషబ్ కూడా చెప్పాడు. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటారా.. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji). ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రధాన పాత్రలో రిషబ్.. ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నాడు. ఈ పాత్ర అవకాశం రావడంపై రిషబ్(Rishab Shetty) స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశాడు.

‘‘ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తుందనన సంతోషంగా, గౌరవంగా ఉంది. ఇది కేవలం సినిమా కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తివంతమైన వ్యక్తి చరిత్ర. ఇలాంటి యోధుడి చరిత్ర సినిమాగా తీసుకురావాలనేది గొప్ప ఆలోచన. ఈ యాక్షన్ డ్రామా కోసం రెడీగా ఉండండి. అద్భుతమైన సినిమాటిక్ నుభవం కోసం కాదు.. శివాజీ గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలను, విశేషాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని రిషబ్ పేర్కొన్నాడు.

Read Also: పుష్ప-2నే కాదు పుష్ప-3 కూడా ఉంది.. ఇదిగో ప్రూఫ్..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...