అల్లు అర్జున్ హీరో తెరకెక్కిన ‘పుష్ప-2(Pushpa 2)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఒక్కో టికెట్ ధర రూ.3000 కూడా పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఈ ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాన్యుడు సినిమాను చూసే పరిస్థితి లేకుండా పోయిందని పిటిషనర్ పేర్కొన్నాడు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కు నోటీసులు జారీ చేసింది. టికెట్ ధరలకు సంబంధించి రెండు వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
పుష్ప 2(Pushpa 2) బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మల్లిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు. ఈ విషయంపై స్పందించిన హైకోర్టు.. పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా జీవోలలను సైతం పరిశీలిస్తామని, రాత్రి 10గంటలకు షో వేస్తే మధ్య రాత్రి 1అవుతుందని, పిల్లలకు నిద్ర అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
థియేటర్ లకు, హస్పటల్స్ కు ప్రభుత్వం భూములు ఇవ్వడంలో ప్రజా ప్రయోజనం ఏముంది ? కనీసం 25శాతం ఆదాయం రావాలి కాని అలా జరగటం లేదు అని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశాలపై పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించింది.