Om Birla | ‘ఆదివారం కూడా సభలు తప్పవు’.. ఎంపీలకు ఓం బిర్ల వార్నింగ్..

-

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ సభలో ప్రతిష్టంభనలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సభలో సభ్యులందరికీ స్పీకర్ ఓం బిర్ల(Om Birla) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ ప్రతిష్టంభనలపై ఘాటుగా స్పందించారు. పలు అంశాలపై చర్చ జరిపించాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్ల సభలు ఆగిపోతున్నాయని గుర్తు చేశారు.

- Advertisement -

తాను కూడా అదే విధంగా ప్రవర్తిస్తే ఇకపై ఆదివారాలు కూడా సభలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏది ఏమైనా సభ కార్యక్రమాలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతిపక్షాలు తమ ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.

అయితే అదానీ(Adani) వ్యవహారం, యూపీలోని సంభల్ అల్లర్లు(Sambhal Violence) వంటి పలు ఇతర అంశాలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీని వల్ల గత వారమంతా సభ కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో ఈ వ్యవహారంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) జోక్యం చేసుకున్నారు. ఆయన జోక్యం తర్వాత సభ సజావుగా సాగింది.

మంగళవారం సభలో కూడా అదానీ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయినా అందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయినప్పటికీ సభను వాయిదా వేయింకుడా కొనసాగించారు స్పీకర్ ఓం బిర్లా.

Read Also: అప్పుడు బాబాయ్… ఇప్పుడు అబ్బాయ్
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం: రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని...

Padi Kaushik Reddy | పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై బంజారాహిల్స్ పోలీస్...