YS Sharmila | అదానీ, జగన్ ఒప్పందం నిగ్గు తేల్చాలి.. షర్మిల డిమాండ్

-

ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానితీతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందంపై నిగ్గు తేల్చాలని ఏపీకాంగ్రెస్ చీప్ షర్మిల(YS Sharmila) డిమాండ్ చేరశారు. సోలార్ ప్రాజెక్ట్ కోసం ఎంత పుచ్చుకున్నారో చెప్పాలన్నారు. అటువంటిదేమీ లేకపోతే ఆధారాలు చూపి.. విమర్శలను తప్పుగా ప్రూవ్ చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులే అదానీ, జగన్ ఒప్పందంపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

‘‘అదానీ, జగన్(YS Jagan) మధ్య జరిగిన సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో బంధించింది. టీడీపీ బోను నుంచి ఏసీబీని విడుదల చేసి స్వేచ్చగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వండి. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే.. చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.

అదానీ(Adani)పై అమెరికాలో దర్యాప్తు జరుగుతుంది. సోలార్ పవర్ డీల్‌లో జగన్‌కి రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చారని వెల్లడైంది. ఈ విషయాన్ని అమెరికా FBI వెల్లడించింది. ఆధారాలు కూడా బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే మన దర్యాప్తు సంస్థలు నిద్ర పోతున్నాయా ?’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈ సోలార్ డీల్‌పై హైకోర్టులో పిటీషన్ కూడా వేసింది. ఇదొక కుంభకోణం అని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అప్పట్లో ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. అధికారం చేతుల్లో పెట్టుకొని ఏం చేస్తున్నారు? జగన్‌కి నష్టం లేదు.. మీకు నష్టం లేదు. నష్టం జరిగేది రాష్ట్ర ప్రజలకు మాత్రమే.

ఒకప్పుడు సోలార్ పవర్ యూనిట్‌కి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు యూనిట్ ధర 1.99 పైసలకు తగ్గింది. రేపు 50 పైసలకే వచ్చినా ఆశ్చపోనక్కర్లేదు. సోలార్ పవర్ రేట్లు తగ్గుతుంటే… మీరు ఎలా 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేశారు..? రూ.2.49 పైసలకు కొని రాష్ట్ర ప్రజలు నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు భారం మోపారా అని చంద్రబాబును అడుగుతున్నాం’’ అని పేర్కొన్నారు.

‘‘అదానీ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. అదానీ బీజేపీ మనిషి.. మోదీ మనిషి. బీజేపీతో మీకు అలయెన్స్ ఉంది. అందుకే మీరు అదానీకి, మోదీకి భయపడుతున్నారు. అదానీని కాపాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సైతం పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయినా మోదీ(PM Modi) నోరు విప్పడం లేదు. మొత్తం దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ అవినీతి బయటకు రాలేదు. ఈ అవినీతి బయటపెట్టని సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వారా..?’’ అంటూ ధ్వజమెత్తారు.

‘‘ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఏసీబీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ రాష్ట్రంలో ఏసీబీ(ACB)ని పంజరంలో చిలుకలా టీడీపీ మార్చింది. చంద్రబాబు.. మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టండి. ప్రజల కోసం పని చేసే ఏసీబీని స్వేచ్చగా పనిచేసే ఆదేశాలు ఇవ్వండి. ప్రజలు మిమల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి’’ అని YS Sharmila హితవు పలికారు.

Read Also: ఇదొక మహత్తర కార్యక్రమం: భట్టి
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...