కీర్తి సురేష్(Keerthy Suresh) తన జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ తన ప్రియుడు తట్టిల్ ఆంటోనీ(Thattil Antony)తో గుట్టుచప్పుడు కాకుండా ప్రమాయణం నడిపిన మహానటి.. ఈ నెలలో పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్, ఆమె తండ్రి సురేశ్ కుమార్ ధృవీకరించారు. గోవా వేదుక ముద్దుగుమ్మ మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. కాకపోతే ఈ వివాహ వేడుక ఎప్పుడు జరగనుందనేది మాత్రం తెలియదు. ఈ క్రమంలోనే ఇదే కీర్తి వెడ్డింగ్ కార్డ్ అంటూ ఒక లగ్నపత్రిక ఫొటో(Wedding Card) నెట్టింట వైరల్ అవుతోంది. దానిపై కీర్తి అండ్ యాంటోనీ వెడ్డింగ్ సెరమొనీ అని రాసుంది.
అంతేకాకుండా డిసెంబర్ 12న వివాహం జరగనుందని పేర్కొంది. అంతేకాకుండా తమ కూతురు పెళ్ళి చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించబోదున్న ఈ జంటకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ఇట్లు మీ సురేశ్ కుమార్, మేనక సురేశ్ అని రాసి ఉంది. కానీ ఇది అధికారిక వెడ్డింగ్ కార్డేనా కాదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇటీవల తన ప్రేమ విషయాన్ని కీర్తి(Keerthy Suresh) అధికారికంగా వెల్లడించింది. 15 ఏళ్ల ప్రేమ ఇంకా కొనసాగుతోందని పేర్కొంటూ ఆంటోనీతో ఉన్న ఫొటోను షేర్ చేసుకుంది.