డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఈరోజు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్ళి కేసీఆర్(KCR)కు ఆహ్వాన పత్రిక అందించారు.
కాగా ఇప్పుడు విగ్రహావిష్కరణకు కేసీఆర్ వెళ్తారా? వెళ్లరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే మొన్నటి వరకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. ఏదో అంటున్నారని అనుకున్నామే తప్ప.. ఇలా ఇంటికెళ్లి ఆహ్వాన పత్రిక ఇస్తారనుకోలేదంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లడంపై పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే..
‘‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున నేను, ప్రోటోకాల్ అధికారులు వచ్చాము. తెలంగాణలో అందరిని గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయం. లంచ్ టైంలో వచ్చాము కాబట్టి కేసీఆర్ లంచ్ చేయమంటే చేశాం. మా భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. మేము అందరిని ఆహ్వానిస్తున్నాం కేసీఆర్ వస్తారా..? రారా..? అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారు’’ అని పొన్నం(Ponnam Prabhakar) తెలిపారు.