Vitamins | ఏయే విటమిన్ వల్ల ఏంటి లాభం.. వాటిని పొందాలంటే ఏం తినాలి..?

-

మనం ఆరోగ్యకరమైన జీవనం పొందాలంటే పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వాటిలో విటమిన్లు అన్ని శరీరానికి సరిపడా అందితేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రతి విటమిన్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. ఏ విటమిన్ స్థాయిలు లోపించినా సరే అవి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని విటమిన్లు లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తే, మరికొన్ని విటమిన్ల(Vitamins) వల్ల మనకు అర్థంకాని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisement -

జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు రావడం, రోగనిరోధక శక్తి క్షీణించడం ఇలా మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చాలా మందికి విటమిన్ లోపం ఉందని తెలిసినప్పటికీ ఎటువంటి ఆహారం తినడం ద్వారా ఆ లోపాన్ని పూడ్చుకోగలం అన్న విషయం తెలియక సతమతమవుతుంటారు.

ఈ క్రమంలోనే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాలంటే ఏం చేయాలి? ఏ విటమిన్ల(Vitamins)తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? వాటిని పొందాలంటే ఏం తినాలి? విటమిన్లు అన్నీ అందేలా చూసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటి? అన్న విషయాలు తెలుసుకుందాం..

Vitamins : 

విటమిన్ “A”: రేచీకటి, అంధత్వం వంటి సమస్యలను దూరం చేయడంలో విటమిన్ ‘ఏ’ అద్భుతంగా దోహపడుతుంది. మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఇవి చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. మన రోగనిరోధక శక్తి బలపరుస్తుంది. దీనిని క్యారెట్, చిలగడదుంప, పాలు, బొప్పాయి, ఆకు కూరల ద్వారా పొందవచ్చు.

విటమిన్ B1 (థయామిన్): బీ1 విటమిన్ మన కండరాలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తృణధాన్యాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్‌లో పుష్పలంగా లభిస్తుంది. బీ1 విమిన్ మనకు తక్షణ శక్తిని అందిస్తుంది.

విటమిన్ B2 (రిబోఫ్లేవిన్): విటమిన్ B2 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల చర్మం, కళ్ళు, జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. పాలు, పెరుగు, పచ్చి కూరగాయలలో బాగా లభిస్తుంది.

విటమిన్ B3 (నియాసిన్): విటమిన్ B3 వల్ల మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది చేపలు, గుడ్డు, చికెన్, తృణధాన్యాలలో లభిస్తుంది.

విటమిన్ B5 (పాంతోతేనిక్ యాసిడ్): విటమిన్ B5 శరీరంలో హార్మోన్లను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలోనూ, శక్తిని పెంచడంలోనూ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని గుడ్లు, చేపలు, పప్పులను తినడం ద్వారా పొందొచ్చు.

విటమిన్ B6 (పిరిడాక్సిన్): అరటి, చేపలు, చికెన్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపక శక్తినీ పెంచుతుంది.

విటమిన్ B7: ఈ విటమిన్ మన జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. గింజలు, విత్తనాలు, గుడ్లలో విటమిన్ బీ7 బాగా లభిస్తుంది.

విటమిన్ B9: గర్భధారణ సమయంలో శిశువు మెదడు, వెన్నుపాము అభివృద్ధికి ఈ విటమిన్ సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తహీనతను దూరం చేస్తుంది. బచ్చలికూర, బ్రకోలీ, నారింజలో విటమిన్ బీ9 ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ B12: ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడంలో సహాయపడుతుంది. చేపలు, పాలు, గుడ్లలో ఇది ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్ “C”: విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. ఎలాంటి గాయమైనా త్వరగా మాన్పించే గుణం విటమిన్ ‘సీ’కి ఉంది. నారింజ, నిమ్మ, ఉసిరి, బెర్రీస్, కివి, టమాటా, నల్ల ఎండుద్రాక్షలలో ఇది పుష్కలంగా ఇది కనిపిస్తుంది.

విటమిన్ “D”: ఈ విటమిన్ మన ఎముకలు, దంతాలను బలంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో కాల్షియం లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఈ విటమిన్‌ను సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. పాలు, చేపలలో కూడా ఇది లభిస్తుంది.

విటమిన్ “E”: అందంగా కనిపించాలనుకునే వారు తమ ఆహారంలో విటమిన్ ఇ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. ఈ విటమిన్ చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరం. బాదం, వాల్నట్, పొద్దుతిరుగుడు విత్తనాలలో అధిక మొత్తంలో విటమిన్ “ఇ” ఉంటుంది.

విటమిన్ “K”: శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది. ఆకు కూరలు, సోయాబీన్, బ్రకోలీలో పుష్కలంగా ఇది లభిస్తుంది.

Read Also: తిండి తగ్గించాలనుకున్నా వల్ల కావట్లేదా.. ఈ టిప్స్ పాటించండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...

Ponnam Prabhakar | ఆటో డ్రైవర్ల కష్టాలకు బీఆర్ఎస్సే కారణం: పొన్నం ప్రభాకర్

ఆటో డ్రైవర్ల(Auto Drivers) సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఈరోజు అసెంబ్లీలో నిరసన...