వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు(Chennamaneni Ramesh) పౌరసత్వంపై తెలంగాణ హైకోర్టు(TG High Court) క్లారిటీ ఇచ్చింది. ఆయన జర్మనీ పౌరుడే అని తేల్చి చెప్పింది. అనంతరం ఈకేసులో చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే తాను భారతీయ పౌరుడినే అని నమ్మించడం కోసం 15 ఏళ్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించింది.
ఇన్నాళ్లూ తప్పుడు డాక్యుమెంట్లు ప్రవేశపెడుతూ కోర్టును తప్పుదోవ పట్టించబోయినందుకు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకుగానూ చెన్నమనేని రమేష్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. వీటిలో రూ.25 లక్షలను ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు, లీగట్ సర్వీసెస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని, ఈ చెల్లింపులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Read Also: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అల్లకల్లోలమవుతున్న దేశ రాజధాని..
ఈ సందర్భంగా పలు కీలక అంశాలను న్యాయమూర్తి ప్రశ్నించారు. చెన్నమనేని రమేష్(Chennamaneni Ramesh) ఇన్నాళ్లూ చేస్తున్న ప్రయాణం ఏ పాస్‌పోర్ట్‌పై చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ఆయన జర్మనీ పాస్‌పోర్ట్ వినియోగిస్తున్నారని, పాస్‌పోర్ట్ పౌరసత్వాని(Citizenship)కి ప్రామాణికంగా తీసుకోలేమని రమేష్ తరపు న్యాయవాది వివరించారు. అసలు చెన్నమనేని దగ్గర భారతీయ పాస్‌పోర్ట్ ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. లేదని న్యాయవాది సబాధానమిచ్చారు. అనంతరం ఈకేసు తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు.