Sandhya Theatre Case | పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ 2లో ఉన్న సంధ్య థియేటర్‌కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించింది. ఈ ఘటన నేపథ్యంలోనే పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సరైన భద్రత చర్యలు చేపట్టకపోవడమే ఈ ఘటనకు దారితీసిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంధ్య థియేటర్ యజమాని, సెక్యూరిటీ మేనేజర్ సహా మరొ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Sandhya Theatre Case | హైదరాబాద్ ఆర్‌టీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లొ నిర్వహించిన ప్రీమియర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు అక్కడకు అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో అభిమానులతో థియేటర్ లోపలకు చొచ్చుకు వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. బాలుడిని రక్షించడం కోసం పోలీసు సిబ్బంది ఎంతో శ్రమించారు. అనంతరం బాలుడిని హాస్పటల్‌కు తరలించారు. అయితే అక్కడ ఏర్పడిన పరిస్థితులను కంట్రోల్ చేయలేకపోయిన పోలీసులు బన్నీ అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు.