మమతా కులకర్ణి(Mamta Kulkarni).. ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసిన నటి. ఈ హీరోయిన్ గురించి ఈ తరం కుర్రోళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు అందుకు 25 ఏళ్ల కిందటే విదేశాలకు వెళ్లిపోవడం కారణం. చేతిలో భారీ సంఖ్యలో ప్రాజెక్ట్‌లు ఉన్న సమయంలో అమ్మడు విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 25 ఏళ్ల తర్వాత తిరిగి ముంబైకు వచ్చింది.
దీంతో ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికే వచ్చారన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ విషయాన్ని మమతా స్వయంగా వెల్లడించింది. తాను ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రావడానికి ప్రధాన కారణం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనైంది
‘‘25ఏళ్ల తర్వాత నా మాతృభూమిపై అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను’’ అని తెలిపింది. అదే విధంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నా చేతిలో 40 సినిమాలు, మూడు ప్లాట్లు, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో ఉన్నా వదులేశాను. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీకి ఇవ్వడానికో, బిగ్‌బాస్‌లో పాల్గొనడానికో రాలేదు. నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించడానికే వచ్చాను’’ అని మమతా(Mamta Kulkarni) వివరించింది. ఆమె సమాధానంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పడింది.