Revanth Reddy | ‘ప్రజల మనోభావాలను కాపాడిన ప్రభుత్వం మాది’

-

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. భారీ సంఖ్యలో అతిథిలు హాజరుకాగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.

- Advertisement -

రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ఎన్నో సంవత్సరాలు అవహేళకు గురైందని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాయని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరం ‘టీజీ’ అని రాసుకున్నామని, ఆ అక్షరాలకు గత ప్రభుత్వం ఎటువంటి గౌరవం ఇవ్వకుండా టీఎస్ అని వాహనాలు, కార్యాలయాలపై రాసి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలు, కార్యాలయాలు అన్నింటిలో ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చామని చెప్పుకొచ్చారు. పదేళ్ల పాటు వివక్షకు గురైన తెలంగాణ తల్లికి సైతం తమ ప్రభుత్వమే ప్రత్యేక, అధికారిక గుర్తించి అందించిందని అన్నారు.

‘‘మీ అందరినీ చూస్తోంటే కృష్ణా, గోదావరి నదులు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు ఉంది. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు… అవమానించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని Revanth Reddy పేర్కొన్నారు.

‘‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ(TG) బదులు టీఎస్(TS) అని నిర్ణయించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్ఛాం. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.

రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీ గారిని సన్మానించుకోడం నాకు జీవితకాలం గుర్తుండే సందర్భం. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది’’ అని తెలిపారు.

‘‘తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది. డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు.. ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం.

తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోంది. వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నాం.

కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు.. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.

తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం.. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం’’ అని తెలిపారు. కాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై కేటీఆర్(KTR) మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్(KCR) ఆనవాళ్లు లేకుండా చేయడానికే కాంగ్రెస్ పూనుకుందని విమర్శించారు.

Read Also: ‘రక్షణ కల్పించండి’.. పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...