తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలిని మార్చే వ్యక్తులను చూశాం కానీ.. తల్లి మర్చే వ్యక్తిని మాత్రం రేవంత్‌నే చూస్తున్నామంటూ విమర్శలు చేశారు. ‘‘కేసీఆర్ తన దీక్షతో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ ప్రకటనకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ ఉన్నంత వరకు రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్(KCR) నాయకత్వంలో జరిగిందని గుర్తిస్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలంగాణపై దాడి చేస్తున్నారు. కేసీఆర్‌ను చిన్నగా చేసి చూపించే ప్రయత్నంలో అస్తిత్వం మీద దాడి జరుగుతోంది. ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయం అయింది. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం అయింది.
సెక్రటేరియట్‌లో లంకె బిందెలు లేవని రేవంత్ రెడ్డికి అర్ధం అయింది. తెలంగాణ ఇస్తే మీకు పరిపాలన రాదని అన్నారు. పదేళ్ళలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ భాషను, యాసను వెక్కిరించారు. ఇందిరాగాంధీ భారతమాతను హరిద్వార్‌లో ఏర్పాటు చేశారు. సమైక్య పాలకులు పగబడితే 2007 లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం’’ అని తెలిపారు.
‘‘హంతకులే సంతాపం తెలిపినట్లు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకున్న వాళ్ళు తెలంగాణ తల్లి(Telangana Talli) బీదగా ఉండాలని రూపాన్ని మార్చారు. ప్రపంచంలో ఆలిని మార్చిన వాళ్ళు ఉన్నారు తల్లిని మార్చిన మూర్ఖులు ఎవరూ లేరు. తెలంగాణ తల్లి ఆకృతిని ఎవరు మార్చమన్నారు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి విగ్రహం మారాలా. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేస్తారా. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనబడుతోంది. తెలంగాణ అస్తిత్వం దెబ్బతీస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగిన వంద సీట్లతో బిఆర్ఎస్ గెలుపు పక్కా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపుతాం. సెక్రటేరియట్ లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపడం పక్కా తెలంగాణలో సాంస్కృతిక విప్లవం రావాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘నేడు జరిగిన అపచారానికి ప్రజలు ఏకం కావాలి. ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుందాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేద్దాము. రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారు. ఘట్ కేసర్ రైతు కోఆపరేటివ్ సోసైటిలో 1190 మంది రైతులు ఉంటే ఒక్కరికి రుణమాఫీ కాలేదు.
రేవంత్ రెడ్డి అదానీ(Adani) కోసం అల్లుని కోసం,అన్నదమ్ముళ్ల కోసం,బామ్మర్ధికి అమృత్ కోసం పని చేస్తున్నారు. వచ్చే సంవత్సరం అనుముల బ్రదర్స్ అదానీ ఆస్తులను మించిపోతారు. వచ్చే సంవత్సరం పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాము. పార్టీ మెంబర్ షిప్ ప్రారంభం చేసుకుందాము’’ అని కేటీఆర్(KTR) అన్నారు.