తనపై తన తండ్రి, నటుడు మోహన్‌బాబు(Mohanbabu) ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్(Manchu Manoj) ఘాటుగా స్పందించాడు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వాళ్లు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిర్యదు ఒక భాగమని అన్నారు. తను, తన భార్య మౌనికపై చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలే అని, వాటిలో ఎటువంటి వాస్తవాలు లేవని మనోజ్ వివరించాడు. అంతేకాకుండా తనకు రక్షణగా నిలబడాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాడు మనోజ్.
‘‘నాతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారు. కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడూ ఆశ పడలేదు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశాను. ఈ వివాదాల్లో నా కూతుర్ని కూడా లాగడం చాలా బాధాకరం. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబం దూరంగానే ఉంటున్నాం. నా ముందే నా కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారు.
ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమైనాయి. నా అన్న విష్ణు దుబాయ్ కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసు. విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదు. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.
నేను నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నాం. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలోని బాధితులకు నేను అండగా ఉన్నాను. బాధితుల పక్షాన నిలబడ్డందుకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మనోజ్(Manchu Manoj) పేర్కొన్నాడు.