మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ జాన్(Baby John)’. ఈ సినిమాలో వరుణ్ ధావన్(Varun Dhawan) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని కలీస్ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. వచ్చిన అతి కొద్ది సమయంలోనే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్, డ్రామాలతో ఫుల్ ప్యాకేజీగా రానుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా పక్కాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ చూస్తే సినిమా ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. దాంతో సమానంగానే డ్రామా, రొమాన్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతి అంశంపై కూడా సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి. బాలీవుడ్ కీర్తి సురేష్.. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అమ్మడి అభిమానులు బల్లగుద్ది చెప్తున్నారు.
ఈ మూవీలో జాకీ ష్రాఫ్, వామికా గబ్బి, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ థియేటర్స్‌లో విడుదల కానుంది. మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా(Baby John) అధిగమిస్తుందో లేదో చూడాలి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి..