ఇండస్ట్రీలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్(Kartik Aaryan). ‘భూల్ భూలయ్య 3’తో భారీ హిట్ అందుకున్నప్పటికీ తనకు ఎవరూ మద్దతుగా నిలవడం లేదని అన్నాడు. అయినా తనకు ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రేమక్షకుల ప్రేమాభినాలు చాలని చెప్పాడు. ‘నేను ఒంటరి యోధుడిని. ఇక్కడి వరకు రావడానికి పిచ్చి వాడిలా పోరాడాను.
ఇంకా పోరాడుతూనే ఉన్నా. నాకు రానున్న కాలంలో కూడా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించదని తెలుసు. అయినా అలా ఏదైనా మ్యాజిక్ హ్యాండ్ నుంచి మద్దతు లభిస్తుందని నేను అనుకోవట్లేదు. ఒంటరిపోరాటాన్ని కొనసాగించడానికి రెడీగా ఉన్నా’’ అని చెప్పాడు.
‘‘భూల్ భులయ్య 3(Bhool Bhulaiyaa 3) సినిమా ఈ ఏడాదిలోనే హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. అయినా నా వెనక ఎవరు రారన్న నిజాన్ని నేను అర్థం చేసుకున్నా. అందుకే మంచి సినిమాలను ఎంపిక చేసుకుని నాకు నేనుగా ఎదగాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రతిభ ఒకటేఉంటే సరిపోదని అర్థం చేసుకున్నాను. నా కెరీర్‌లో ఎందరినో కలిశాను.
కానీ ఇండస్ట్రీలోని పెద్దలను మాత్రం కలిసే అవకాశం రాలేదు. వారి మనసులు గెలవాలన్న కొరిక, ఆవ నాకు లేదు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు గెలుచుకుంటే అదే నాకు పెద్ద విజయం. వారి సపోర్ట్ ఉంటె ఏదైనా సాధించగలను’’ అని ఆర్యన్(Kartik Aaryan) చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. మరి దీనిపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.