మంచు ఫ్యామిలీ విషయంపై మంచు విష్ణు(Manchu Vishnu) స్పందించారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉన్నట్లే తమ ఇంట్లో కూడా ఉన్నాయని, అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. ‘‘ఇలాంటి పరిస్థితి మా కుటుంబానికి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మోహన్ బాబు గారికి మీడియా అంటే గౌరవం ఉంది. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. మా నాన్న తప్పు చేసిన పని ఏమంటే తన పిల్లలని ఎక్కువ గా ప్రేమించడం. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుంది.. సమస్యలు ఉంటాయి.
సినీ ఫ్యామిలీ అని చెప్పి ఇలాచేయడం సరికాదు. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదు. సినిమా షూటింగ్ లో ఉండగా వివాదం జరిగిందని తెలిసి వచ్చాను.. తాను ఇక్కడ ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. నిన్న జరిగిన ఘటనలో ఓ రిపోర్టర్ కు గాయాలు కావడం… గేటు తోసు కొని లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది… ఆవేశంలో జరిగిందే తప్ప ఎలాంటి ఉద్యేశ పూర్వకం కాదు’’ అని వివరించాడు.
‘‘పోలీసులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ముందుగా మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం నోటీసు ఇచ్చారు.. సమయం తీసుకొని కమిషనర్‌ను కలుస్తా. చట్టం ప్రకారం నేను కలవాల్సిన అవసరం లేదు.. కానీ పోలీసుపై ఉన్న గౌరవంతో కలుస్తా. ప్రేమతో సమస్యను పరిష్కరించుకోవాలి.. రచ్చకెక్కడం కరెక్ట్ కాదు. మనోజ్ పెళ్లి చేసుకొని పిల్లని కన్నాడు.. మా నాన్నకు సంబంధించిన ఆస్తులు ఆయనకే హక్కులు ఉంటాయి.
తండ్రి ఇంట్లో ఉండటానికి ఇష్టం లేదన్నప్పుడు..ఎవరైనా బయటకు వెల్లాల్సిందే.. తల్లి తండ్రులను గౌరవించాలి. హద్దు మీరుతున్న వారు కొంతమంది ఉన్నారు.. ఇది కరెక్ట్ కాదు. కొడుకుగా తల్లి తండ్రిని మంచిగా చూసుకోవడమే నా ముందు ఉన్న లక్ష్యం. వినయ్ అనే వ్యక్తి నాకు అన్నలాంటి వారు. ఆయనతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. మోహన్ బాబు యూనివర్సిటీని విలువలతో నడుపుతున్నాం. యూనివర్సిటీ మాకు దేవాలయంతో సమానం.
మా ఇంటి వివాదంలో తలదూర్చిన బయటి వ్యక్తులు దూరంగా ఉంటే మంచిది సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.. తొందరలోనే అన్ని సర్దుకుంటాయి’’ అని విష్ణు(Manchu Vishnu) వివరించాడు.