మోహన్ బాబు(Mohan Babu) ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి.. మనోజ్ రావడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని క్రమంలో మోహన్ బాబుకు దెబ్బ తగిలింది. దీంతో ఆయనను విష్ణు వెంటనే కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
మోహన్ బాబును అడ్మిట్ చేసుకున్న డాక్టర్స్.. పలు రకాల పరీక్షలు చేశారు. బీపీ, హార్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయని వారు వివరించారు. ఈమేరకు ఈరోజు వారు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మోహన్ బాబు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు.
మోహన్ బాబు(Mohan Babu) ఒళ్లు నొప్పులు, ఆందోళన, స్పృహ తప్పిన కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ప్రస్తుతం స్థిమితంగా లేరని, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదని చెప్పారు. ఆయన ఆర్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉందని, కంట్రోల్ కావడం లేదని, ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు వివరించారు.
ఆయనకు ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఆయన ప్రస్తుతం వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. ప్రస్తుతం మోహన్ బాబు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుకుని వైద్యం అందించాలని అన్నారు.