Temperatures | ఉత్తర భారతదేశ రాష్ట్రాలను చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగాఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 4.5 డిగ్రీలు నమోదవుతున్నాయి. గురువారం.. ఆయా ప్రాంతాల్లో గరిష్ఠంగా 16 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
Temperatures | చలి తీవ్రత పెరుగుతున్న క్రమంలో నిరాశ్రయులకు షెల్టర్లు సిద్ధ చేయాలని, వారికి ఆహారాన్ని అందించడంతో పాటు వెచ్చగా ఉండటం కోసం స్వెట్లర్లు వంటివి కూడా అందించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. నైట్ షెల్టర్లలో నిరాశ్రయులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా ఈ చలికాలంలో రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసే వారికి.. హైవేలపై ఉచితంగా టీ అందించాలన్న అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.