సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈరోజు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు(Chandrababu) కూడా రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బాబు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
- Advertisement -
‘‘నా ప్రియ మిత్రుడు, లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.