ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి తాజాగా హైకోర్టు నోటీసులను జారీ చేసింది… ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎస్టీ రిజర్వుడు అయిన కురుపాం నియోజకవర్గంలో పుష్ప శ్రీవాణి పోటీ చేసి గెలిచారు…
ప్రస్తుతం ఆమె ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు… అయితే ఆమె ఎన్నిక చెల్లదని పుష్ప శ్రీవాణి చేతిలో ఓటమి పాలు అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎస్ సింహాచలం అలాగే బీజేపీ అభ్యర్థి ఎన్ జయరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు…
గత ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి తప్పుడు కుల దృవీకరణ పత్రం చూపించి పోటీ చేసి గెలిచారని తమ పిటీషన్ లో పేర్కొంటు ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోర్టు ను ఆశ్రయించారు… అయితే ఈ పిటీషన్ పై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీవాణికి నోటీసులు జారీ చేసింది…