ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అండా నిలిచి అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన మహిళకు తాను అండగా ఉంటానని మరోసారి చెప్పాడు బన్నీ. ఆ రోజున జరిగిన ప్రమాదంలో మహిళ మరణించడం తనను ఎంతగానో బాధించిందని చెప్పాడు.
‘‘నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని చట్టానికి కట్టుబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. నేను సినిమా చూడటానికి వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నా. నేను చేసిన సినిమాలే కాదు. మావయ్య సినిమాలూ చూశా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభిమానం, ప్రేమతో అండా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నా ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని బన్నీ(Allu Arjun) చెప్పుకొచ్చాడు.