చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) నుంచి విడుదలైన ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్(Allu Arjun)కు కుటుంబ సభ్యులు అంతా ఎదురొచ్చి స్వాగతం పలికారు. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన కుమారుడు, కూతురును ఎత్తుకుని బన్నీ భావోద్వేగానికి గురయ్యాడు. సతీమణి స్నేహ కూడా భావోద్వేగానికి గురైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లూ శిరీష్ కూడా బన్నీ నివాసానికి చేరుకుని.. అన్నకు వెల్కమ్ పలికాడు. అయితే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ న్యాయవాడుల బందంతో చర్చించాడు.
హైకోర్టులో బన్నీ బెయిల్ కోసం వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డితో బన్నీ దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. బెయిల్ వచ్చినా, తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా.. విడుదల ఆలస్యం కావడంపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) తన నివాసానికి బయలుదేరాడు.