ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్య వ్యాపారంలా మారిపోయింది. లక్షల రూపాయాలు దండుకోవడానికి విద్యారంగం ఒక మంచి మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు పెట్టి.. లక్షల్లో ఫీజులు గుంజుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిని వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యను సేవా భావంతో అందించేలా చర్చలు తీసుకోవడానికి మేధోమథనం జరగాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో జివాజీరావు సింథియా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన దేశంలో విద్య వ్యాపారంలో పారిపోవాడాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సంస్థలు విద్యారంగంపై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
‘‘దేశంలో ప్రతిఒక్కరికీ నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి మన జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకోబోతున్నాయి. సవాళ్లను అవకాశాలుగా మలచుకోవడం విద్యాసంస్థ కర్తవ్యం’’ అని తెలిపారాయన(Jagdeep Dhankhar).