సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్ళి, రిలేషన్ వంటి విషయాలు అభిమానులకు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. తమ అభిమాన నటుల జీవితాల్లో ఏం జరుగుతుందన్న విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులు ఎప్పుడూ అమితమైన ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన(Rashmika) ఒకరు. రష్మిక రిలేషన్‌లో ఉందా? ఉంటే ఎవరితో? అమ్మడి పెళ్ళి ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి.
వీటితోపాటుగా రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రిలేషన్‌లో ఉన్నారన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ సక్సెస్ మీట్‌లో తన రిలేషన్, తన జీవితంలోకి వచ్చే పార్ట్‌నర్ ఎలా ఉండాలి అన్న విషయాలను ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఎలాంటి అబ్బాయిలను తాను ఇష్టపడతాను అన్నది కూడా చెప్పేసింది.
‘నాకు భాగస్వామి అయ్యే వాడు నా జీవితంలోని ప్రతి దశలో తోడుగా ఉండాలి. అన్ని వేళలా నాకు భద్రతను ఇవ్వాలి. జీవితంలో వచ్చే కష్ట సమయంలో నాకు మద్దుతగా నిలవాలి. కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. శ్రద్ధ చూపాలి. మంచి మనసు ఉండాలి.
ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితాంతం కలిసి ఉండొచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలి. నా దృష్టిలో ప్రేమలో ఉండటం అంటే భాగస్వామిని కలిగి ఉండటమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. మన ఒడుకుదుడుకుల్లో మనతో ఉండి సపోర్ట్ చేసేవారు ఉండాలి’’ అని చెప్పారు రష్మిక మందానా(Rashmika).