వర్మపై కేసు నమోదు…

వర్మపై కేసు నమోదు...

0
98

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మపై మరోకేసు దాఖలు అయింది… ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సంచలన చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు… ఈచిత్రానికి సంబంధించిన ఇటీవలే సినీ బృందం రెండు ట్రైలర్లనుకూడా విడుదల చేసింది…

ప్రస్తుతం ఈ రెండు ట్రైలర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… అయితే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను వర్మ అవమానించేలా చిత్రించారని తాజాగా క్రైస్తవ మత భోదస్తుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు… ఈ సినిమాను అడ్డుకోవాలని కోరుతూ పిటీషన్ ను దాఖలు చేశారు…

ఆ కేసులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ జబర్దస్త్ కమెడియన్ రాము తదితరులు చేర్చారు… కాగా ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు….