Tabu | భూత్ బంగ్లాలోకి టబు ఎంట్రీ.. 24 ఏళ్ల తర్వాత..

-

అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా ప్రదియదర్శన్ డైరెక్ట్ చేస్తున్న తాజాగా సినిమా ‘భూత్ బంగ్లా’. ఈ సినిమాలో వామిగా గబ్బి కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ సహా పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక పాత్ర కోసం టబు(Tabu)ను సంప్రదించారు మూవీ టీమ్. కథ బాగా నచ్చడంతో టబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రెపో మాపో ‘భూత్ బంగ్లా’ సెట్స్‌లోకి టబు కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ పేర్కొంది. ఈ సినిమాను ప్రతి ప్రేక్షకుడు బాగా ఎంజాయ్ చేస్తాడని మూవీ టీమ్ ధీమాగా ఉంది.

- Advertisement -

అయితే 2000 సంవత్సరంలో వచ్చిన ‘హేరా పేరీ’ తర్వాత అక్షయ్, టబు(Tabu), ప్రియదర్శన్ కాంబోలో వస్తున్న మూవీ ఇదే. దాదాపు 24 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కామెడీ హర్రర్‌గా తెరకెక్కనుందని అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో. ఈ సినిమాను(Bhooth Bangla) 2 ఏప్రిల్ 2026న విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.

Read Also: ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....