ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవిని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఆప్ ప్రభుత్వ ఎజెండాను పటాలు తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తారని, అతిశీ(CM Atishi) అరెస్టుకు ముందే ఆప్ నేతల ఇళ్లపై దాడులు జరుగుతాయని ఆయన ట్వీట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. మరో రెండు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్(Kejriwal) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.