మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరో ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతం కానుంది. 52 అడుగుల పొడవు, 52 అడుగుల వెడల్పు గల మహా మృత్యుంజయ యంత్రాన్ని(Mahamrityunjay Yantra) ఏర్పాటు చేయనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోని ఇసుకపై యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ యంత్రం, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఇంత భారీగా ఏర్పాటు చేయటం విశేషం. మహా మృత్యుంజయ మంత్రంలోని 52 అక్షరాలు, వాటి కొలతలు, పొడవు, వెడల్పు ఎత్తు 52 అడుగులు ఉండేలా యంత్రం రూపొందించబడింది. యంత్రం ప్రఖ్యాత పండితులచే పవిత్రం చేయబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందని వారు భావిస్తున్నారు.
మహా మృత్యుంజయ యంత్ర సంస్థ అధిపతి స్వామి సహజానంద సరస్వతి(Swami Sehajanand Saraswati) మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద మహామృత్యుంజయ యంత్రాన్ని 2025లో ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అసాధారణ దివ్య సంఘటన మానవాళికి ఒక చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు. భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు ఈ గొప్ప వేడుకను చూసేందుకు వస్తున్నారన్నారు. యంత్రం కొలతలు హిందూమతంలోని 52 సిద్ధ పీఠాలను (పవిత్ర స్థలాలు) సూచిస్తాయని ఆయన వివరించారు. క్లీన్ కుంభమేళా కోసం ప్రధానమంత్రి పిలుపులో భాగంగా, ఈవెంట్ కి వచ్చిన వారికి ఇకో ఫ్రెండ్లీ బ్యాగ్‌లు పంపిణీ చేయబడతాయి అని తెలిపారు.
కాగా, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) సమావేశమయ్యారు. ఈ భేటీలో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఏర్పాట్లపై ఇరువురు నేతలు చర్చించారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని మోదీకి సీఎం యోగి ఆహ్వానం పలికారు. హిందూమతం అత్యంత గౌరవప్రదమైన సమావేశాలలో ఒకటైన మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు నిర్వహించబడుతుంది. ఇది త్రివేణి సంగమం వద్ద పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక నాయకులు, యోగులు, యాత్రికులు సహా మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇది భారతదేశ ఆధ్యాత్మిక క్యాలెండర్‌లో ఒక స్మారక సందర్భంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.