స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ జోనర్ ‘ది రాజా సాబ్(The Raja Saab)’ మూవీ ఒకటి. అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదట అనుకున్న ప్రకారం ఏప్రిల్ 10న వెండితెరపైకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు విడుదల వాయిదా పడింది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉండక తప్పదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచేందుకు మేకర్స్ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి స్పెషల్ విషెస్ పోస్టర్‌ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రముఖ డైరెక్టర్ మారుతీ(Director Maruthi) నేతృత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ది రాజా సాబ్(The Raja Saab) సినిమాకి పాపులర్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ సంగీతం అందించనున్నారు. ప్రభాస్ పక్కన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా మే 16న భారీగా థియేటర్లలో విడుదల కానుంది.