Meenakshi Natarajan | తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన ఇన్‌ఛార్జ్

-

తెలంగాణ కాంగ్రెస్ కీలక మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi)ని ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొలగించింది పార్టీ అధిష్ఠానం. ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్‌(Meenakshi Natarajan)ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌(Telangana Congress Incharge) కూడా మారారు. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నియమితులయ్యారు. ఆమె రాహుల్ గాంధీ(Rahul Gandhi) బృందంలో కీలకంగా వ్యవహరించారు.

- Advertisement -

కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌లు వీరే

హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్‌కు రజనీ పాటిల్

హర్యానాకు బీకే హరిప్రసాద్

మధ్యప్రదేశ్‌కు హరీశ్ చౌదరి

తమిళనాడు, పుదుచ్చేరికి గిరీశ్ చౌడాంకర్

ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ

ఝార్ఖండ్‌కు కే రాజు

మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌కు సప్తగిరి శంకర్ ఉల్కా

బీహార్‌కు కృష్ణ అల్లవారులను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Read Also: ‘మోదీతో పరాచకాలా రేవంత్.. ప్రజలే బుద్ది చెప్తారు’
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

IAS Officers | తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఏఎస్‌లను(IAS Officers) బదిలీ చేసింది. మొత్తం...

Delhi Ministers | ఢిల్లీ కొత్త మంత్రుల పూర్తి వివరాలివే!

Delhi Ministers | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోరు హోరాహోరీగా...